మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానులు ఇంకా కంగారు పడుతూనే ఉన్నారు. తేజ్ ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉండటంతో ఎలా కోలుకుంటాడో అన్న టెన్షన్ నెలకొంది. అయితే, అభిమానులకు ఊరటనిస్తూ మోహన్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు.
మంచు లక్ష్మితో కలిసి మోహన్ బాబు అపోలో ఆసుపత్రిలో తేజ్ ను పరామర్శించాడు. తను ఆరోగ్యంగానే ఉన్నాడని, కోలుకుంటున్నాడన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తను డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపాడు.
Advertisements
సెప్టెంబర్ 10న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.