సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వెంట వెంటనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. తను నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా త్వరలో రిలీజ్ కానుండగా… దేవకట్ట దర్శకత్వంలో సోషల్ మెసెజ్ ఇచ్చే ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి రిపబ్లిక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతుంది.
ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ యంగ్ ఐఏఎస్ అధికారిగా కనపడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తైన ఈ మూవీ, ఇటీవలే ఏలూరు చుట్టుప్రక్క ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. కొల్లేరు సమస్యపై ఫోకస్ గా ఈ షాట్స్ ఉన్నట్లు ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.
ఇక ఈ మూవీలో రమ్యకృష్ణ ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తుంది. సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కార్తీక్ దండు దర్శకత్వంలో మూవీ చేసేందుకు కూడా సాయి ధరమ్ తేజ్ ఒప్పుకున్నట్లు టాక్.