మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ ఐకియా స్టోర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన తేజ్ కు రాత్రి నుండి అపోలో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తేజ్ కాలర్ బోన్ విరిగినట్లు ఇప్పటికే నిర్ధారించిన వైద్యులు… ఇతరత్రా అంతర్గత గాయలేమైనా ఉన్నాయా అని అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. తనకు సిటీ స్కాన్ తో పాటు పలు వైద్య పరీక్షలు చేశారు. అయితే, ఈ పరీక్షల్లో తనకు ఇతరత్రా ఎలాంటి గాయాలు కాలేదని తేలింది. ఎలాంటి ఆర్గాన్ డ్యామెజ్ లేదని తేల్చారు. అయితే, తనను ఐసీయూలోనే ఉంచి వైద్య బృందం పర్యవేక్షిస్తుందని, మరిన్ని వైద్య పరీక్షలు చేయబోతున్నట్లు తెలిపారు.
అయితే, తనకు సృహా వచ్చిందా… లేదా అన్నది మాత్రం అపోలో వైద్యులు క్లారిటీ ఇవ్వలేదు. తేజ్ ఆరోగ్య పరిస్థితిపై నెక్ట్స్ హెల్త్ బులిటెన్ ఆదివారం ఉదయం ప్రకటిస్తామని వైద్యులు తెలిపారు.
Advertisements