కరోనా వైరస్ లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడగా, ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. దింతో లాక్ డౌన్ తర్వాత మొదటిగా సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ కానుంది. డిసెంబర్25న మూవీ విడుదల కాబోతుంది.
అయితే ఈ మూవీని ఓటిటి రిలీజ్ కోసం జీ5 సంస్థ రైట్స్ తీసుకోగా, థియేటర్లలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి దాదాపు 10కోట్ల వరకు ఇచ్చి కొనుగోలు చేసేందుకు దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ ఆఫర్స్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని కలిపి సోలో బ్రతుకే సో బెటర్ బాగానే సంపాందించేలా ఉంది.
ఈ మూవీకి సుబ్బు దర్శకత్వం వహించగా, నభా నటేష్ హీరోయిన్.