ప్రతి రోజు పండగే తర్వాత సాయి ధరమ్ తేజ్ దేవకట్టా దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ పొలిటికల్ డ్రామా మూవీకి రిపబ్లిక్ అనే పేరు పెట్టునున్నట్లు ప్రచారం జరిగింది. ఫైనల్ చిత్ర యూనిట్ రిపబ్లిక్ అనే టైటిల్ నే ఖరారు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దేశంలోని సామాజిక పరిస్థితులు, న్యాయవ్యవస్థ, రాజకీయాలు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తెరకెక్కుతోంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా… జీ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది.