కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ నెల 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ ను ఇష్టపడే విరాట్ పాత్రలో కనిపించనున్నాడు. బ్యాచిలర్ గా ఉంటే జీవితం ఎలా ఉంటుందో చెబుతూ విరాట్ శ్లోకాలు చెబుతుంటాడు. తాజాగా ట్విట్టర్ లో ఆ శ్లోకాన్ని పోస్ట్ చేశాడు. రంభ, ఊర్వశి, మేనక లవ్ లోనో, పెళ్లి చేసుకునో ఉంటే స్వర్గానికి అంత డిమాండ్ ఉండేది కాదంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
#Viratslokas pic.twitter.com/idJOaDYcaQ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 22, 2020
Advertisements