యంగ్ మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ మంచి జోష్ మీదున్నాడు. బాహుబలి కట్టప్పను చిన్నపిల్లాడిని చేసేశాడు. చిరు జల్లుల్లో ఇద్దరూ గొడుగులు చేతబట్టి ‘ప్రతి రోజూ పండగే’ అంటూ చిందేశారు.
ఇది యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ రూపొందిస్తున్న ప్రతి రోజూ పండగే మూవీ సీన్. డైరెక్టర్ మారుతి ఇదే సీన్ ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. సాయిధరమ్ తేజ్, సత్యరాజ్ అల్లరి కుర్రాళ్ళ మాదిరిగా హుషారుగా వర్షంలో చిందేసే ఫస్ట్ లుక్ భలేగా ఉంది. వర్షంలో డ్యాన్స్ చేయడానికి మీకు వయసుతో పనిలేదు. లాలీపాప్ తినడానికి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వయస్సు ఎంత అన్నది అక్కర్లేదు..అంటూ సాయిధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ట్వీట్ చేశారు.
ప్రతి రోజూ పండగే మూవీలో మారుతి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనడానికి ఫస్ట్ లుక్ మచ్చుతునక. హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్, తమన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. కుటుంబ కథాంశంతో ఫాన్స్‌కి ఇది ఒక పండగే…!