వీరసింహారెడ్డి.. ఈ సినిమా టైటిల్, అందులో బాలయ్య లుక్, తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే ఇదొక ఫ్యాక్షన్ మూవీ అనే విషయం ఇట్టే అర్థమౌతుంది. మేకర్స్ కూడా ఈ విషయాన్ని ఖండించడం లేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తోనే సినిమా వస్తోందని చెబుతూ వస్తున్నారు.
అయితే ఈ అంశాలతో పాటు.. వీరసింహారెడ్డిలో మరో బలమైన అంశం ఉందంటున్నారు మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా. వీరసింహారెడ్డి సినిమాకు డైలాగ్స్ రాసిన ఈ రైటర్.. సినిమాలో ఓ సరికొత్త ఎమోషన్ ఉందని చెబుతున్నాడు.
“నాకు ప్రతి కథ ఒక సవాలే. ఒక సినిమాకి రాస్తున్నపుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో వున్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు. పైగా వీరసింహారెడ్డి కొత్త కథ. ఇందులో అద్భుతమైన సోల్ వుంది. ఈ పాయింట్ వింటే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. కథ వినగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వీరసింహా రెడ్డి కథలో అద్భుతమైన ఎమోషన్ వుంది. వీరసింహా రెడ్డి డైలాగ్స్ రాయడానికి రెండు నెలలు పట్టింది.”
ఇలా వీరసింహారెడ్డిపై ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడు సాయిమాధవ్. సంక్రాంకి రిలీజ్ అవుతున్న రెండు సినిమాలూ హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు ఈ రచయిత.