పవర్ స్టార్.. ఆ పదానికి ఎంత పవర్ ఉంటుందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అంతలా మార్చేశారు. ఇప్పుడు అంతే రేంజ్ లో లేడీ పవర్ స్టార్ గా పిలిపించుకుంటోంది సాయిపల్లవి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీనీ దున్నేస్తోంది. ఒక స్టార్ హీరోనే సాయి పల్లవి నే ఈ సినిమాకు హీరో అన్నాడు అంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
తాజాగా.. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కర్నూల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. స్టేజి మొత్తం రెడీ చేశారు.. కానీ అంతలోనే చిన్న అపశృతి చోటుచేసుకుంది. గాలివాన కు ఆ స్టేజి కూలిపోయింది. సాధారణంగా వేరే ఎవరైనా అయితే ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకొనేవారు.కానీ.. సాయి ప్లాలవి మాత్రం అభిమానులు తన కోసం చూస్తున్నారని తెలిసి గాలివాన లెక్కచేయకుండా వర్షంలోనే తడుస్తూ స్పీచ్ ఇచ్చింది.
అభిమానులు సైతం వర్షాన్ని లెక్కచేయకుండా ఆమె మాటలు వింటూ నిలబడ్డారు. ఇలాంటి సంఘటనలు స్టార్ హీరోల విషయంలో జరుగుతూ ఉంటాయి. కానీ.. మొదటిసారి ఒక హీరోయిన్ కోసం అంతమంది అభిమానులు వర్షంలో తడుస్తూ నిలబడడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అందుకే ఆమె నిజంగానే లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఈవెంట్ అనంతరం అంతటి గాలివానలో అభిమానులు ఎలా తిరిగి వెళ్లారోనని.. తాజాగా ట్వీట్ కూడా చేసింది సాయి పల్లవి. ‘నన్ను క్షమించండి. ఈరోజు మీ అందరినీ కలవాలని నేను నిజంగా ఎదురు చూశాను. మనం త్వరలో మళ్లీ కలుద్దాం! వర్షం కురుస్తున్నప్పటికీ.. తిరిగి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరందరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్ చేసింది. ఫ్యాన్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇంత వరకు అభిమానుల క్షేమం గురించి అగ్రస్థాయి హీరోలే తప్ప.. హీరోయిన్స్ ఇంతలా కేర్ తీసుకోవడం చూడలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. తన ట్వీట్ కు అభిమానులు రిప్లై ఇస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. అయితే.. ఈవెంట్ సందర్భంగా సాయి పల్లవి బంగారు రంగు చీరలో ఆకర్షించింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.