హీరోయిన్ సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు అమ్మాయిలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ తన నటనతో డాన్స్ తో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రంలో సాయి పల్లవి దేవదాసిగా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ పాటకు సాయి పల్లవి విశ్వరూపం చూపించింది. తన డాన్స్ తో డాన్స్ మాస్టర్ లకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే ఆ డ్యాన్స్ వెనుక ఉన్న కష్టం అంతా ఇంతా కాదు. అందుకు సాక్ష్యం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు.
ప్రళయ సాంగ్ కోసం ఈ సినిమాలో ఎక్కువగా కష్టపడింది సాయి పల్లవి. ఆమె ఎంతగా కష్టపడిందో రిహార్సల్స్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.