సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించబోతున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పన్ కొషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఓ చిన్న రోల్ కోసం దర్శకనిర్మాతలు సాయి పల్లవిని సంప్రదించారట.
అందుకుగాను సాయిపల్లవి రెమ్యునరేషన్ పెద్దమొత్తంలో డిమాండ్ చేసిందట. మొత్తం మీద నాలుగైదు సీన్లు సాయిపల్లవి పాత్రకు ఉంటాయట. ఆ సన్నివేశాలు కూడా కీలకమైనవి కావడంతో సాయిపల్లవి కాస్త గట్టిగానే డిమాండ్ చేసిందట. ఎంత అంటే ఏకంగా రెండు కోట్లు అడిగిందట. ఇక సాయి పల్లవి సాయి పల్లవి రెమ్యునరేషన్ దృష్టిలో పెట్టుకుని ఆమెనే తీసుకోవాలా వేరే హీరోయిన్ని తీసుకోవాలా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ పడిందట.