రానా దగ్గుబాటి హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా విరాటపర్వం. శనివారం సాయిపల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సాయిపల్లవి లుక్ ని విదుదల చేసింది. నక్సలైట్ల కాలంనాటి కథాంశాన్ని తీసుకుని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి సాధారణ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుందని లుక్ ని చూస్తే అర్ధం అవుతుంది. అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని పుస్తకము పెన్ను పట్టుకుని, పక్కన బ్యాగ్ పెట్టుకుని ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా లుక్ ని రిలీజ్ చేశారు. ఇంతవరకూ సాయిపల్లవి ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. అయితే ఈ సినిమాలో జానపద గాయనిగా కనిపించనుందని సమాచారం.
సురేష్ ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.