శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఫిదా. ఈ సినిమాతో సాయి పల్లవి తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తరువాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు వంటి సినిమాలతో మంచి జోష్ ని చూపించింది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 18న విడుదలకానుంది.
కాగా సినిమాల ఎంపిక, ముద్దు సన్నివేశాల విషయాలపై పల్లవి స్పందించింది. ఓ సినిమాలో రొమాంటిక్ సీన్లు నటించేటప్పుడు హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు సూచించాడు. అయితే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం నాకు కంఫర్ట్ గా అనిపించదు అని ఆ డైరెక్టర్ కు చెప్పేశాను. అలా మీ టూ కారణంగా తప్పించుకున్న అంటూ సాయి పల్లవి సమాధానమిచ్చింది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం సాయి పల్లవి చెప్పలేదు.