ప్రముఖ సింగర్ స్మిత సోనీ లీవ్ వేదికగా ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షో చేస్తోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి రెండు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు, రానా, నాని ఈ షోలో కనిపించి సందడి చేశారు. తాజాగా ఇప్పుడు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా ఈ ప్రోగ్రామ్ కి గెస్టుగా వచ్చింది. ఈ క్రమంలో మీటూ ఉద్యమంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సాయిపల్లవి.
మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందని.. దీనిపై చాలా మంది వారి బాధలను బయటపెట్టారని చెప్పింది. అయితే ఎవరైనా చేతలతోనే కాదు.. మాటలతో ఎదుటి వ్యక్తికి ఇబ్బందులు కలిగించేలా చేసినా అది కూడా వేధింపులతో సమానేమే అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
అందరిలాగే నేను కూడా కెరీర్ లో ఇలాంటి ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నా అంది. అయినా బలమైన సంకల్పంతో ముందుకెళ్తున్నానని సాయిపల్లవి తెలిపింది. అలాగే తారక్, బన్నీ, చెర్రీ వీరిలో ఎవరితో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారని అడగ్గా.. ఆ ముగ్గురూ నాతో ఒక సాంగ్ చేస్తే బాగుంటుందని అని చెప్పుకొచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.