శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే తాజాగా సాయి పల్లవి తన మొదటి సినిమా హీరో వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సెట్లో చాలా సరదాగా ఉండేవాడని షూటింగ్ మొదలవ్వగానే యాక్టింగ్ బాగా చేసేవాడిని చెప్పింది. ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లికి పదేపదే చెప్పేదాన్ని అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతోంది.