ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తమిళ్, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల్లో మంచి ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె… వెండితెరతో పాటు డిజిటల్ రంగంలోకి కూడా సాయిపల్లవి ఎంట్రీ ఇచ్చింది.
రీసెంట్‌గా సాయిపల్లవి నటించిన వెబ్ సిరీస్ పావ కదైగల్. నాలుగు కథల సమాహారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ను విఘ్నేశ్ శివన్, సుధాకొంగర, గౌతమ్ మీనన్, వెట్రిమారన్ తెరకెక్కించారు. డిసెంబర్ 18న సినిమా విడుదల కానుంది. తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌తో కలిసి నటించడానికి భయపడ్డానని, ఆయన గంభీరత చూసి ఆ భయం కలిగేదని, సెట్‌లో ఉండేటప్పుడు ఆయన పాత్రలోనే ఉండేవారని సాయిపల్లవి పేర్కొంది.
డాక్టర్ కోర్సు చదివి యాక్టర్ అయిన సాయిపల్లవి… తను యాక్టింగ్ మానేస్తే మళ్లీ డాక్టర్ వృత్తికి వెళ్లిపోతానంటూ సమాధానం ఇస్తుంది.