హీరోయిన్ సాయి పల్లవిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. దానికి కారణం ఆమె చేసిన కామెంట్స్. మొన్నటివరకు సాయి పల్లవిని అభినందించిన వారే ఇప్పుడు ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలను ఇస్తుంది సాయి పల్లవి. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాటపర్వం సినిమా గురించి కొన్ని అంశాలను షేర్ చేసుకుంది.
అలాగే కాశ్మీరీ పండిట్ ల గురించి, మారణహోమం గో హత్యలను వీటన్నింటినీ లింక్ చేస్తూ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. శాంతి అనేది ఓ ఐడియాలజీ అని నాకు వైలెన్స్ అనేది తప్పుగా అనిపిస్తుందని… న్యూట్రల్ గా ఆలోచించడం నేర్చుకోవాలని ఏ విషయంలోనూ ఎవరిది పూర్తిగా తప్పు అని చెప్పలేమని తెలిపింది.
పవన్ మూడో భార్య ఆస్తులు విలువ తెలుసా? షాక్ అవ్వాల్సిందే!
పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన జవాన్లు టెర్రరిస్ట్ లుగా కనిపిస్తున్నారు. మనకు వాళ్ళు అలానే కనిపిస్తారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది చెప్పడం కష్టం. కాశ్మీర్ పండిట్ లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించారు. మరి రీసెంట్ గా ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్ ను కొట్టి జై శ్రీరామ్ అని అన్నారు.
మరి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది. నేను నమ్మేది ఒకటే. మనం మంచి వ్యక్తిగా ఉంటే న్యాయం ఉంటుంది. మనం మంచిగా ఉండకపోతే న్యాయం ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి పైన నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
నయనతార తల్లి అందుకే పెళ్లికి రాలేదా? ఇంత జరిగిందా!!
Equating the genocide of Kashmiri Pandits with the random beating of a cow smuggler.
What kind of thinking is this!? pic.twitter.com/TWYx2gJGLw
— GappaTG™ 🦜 (@GappaTG) June 14, 2022
Advertisements