శేఖర్ కమ్ముల ఫిదా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నటి సాయి పల్లవి. తక్కువ కాలంలోనే మంచి సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం సాయి పల్లవి నటించిన గార్గి సినిమా మంచి స్పందన అందుకుంటోంది.
జులై 15న ఈ చిత్రం విడుదల కాగా, ప్రస్తుతం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు సాయి పల్లవి స్వయంగా వెళ్లి సందడి చేస్తున్నారు. చెన్నై,హైదరాబాద్ లోని పలు థియేటర్లను ఆమె సందర్శించి కొద్ది సమయం పాటు తన సినిమాను వీక్షించడమే కాకుండా, అభిమానుల కేరింతలను స్వయంగా చూశారు. వారితో ముచ్చటించారు.
ఈలలు వేస్తూ సాయి పల్లవికి అభిమానులు స్వాగతం పలికారు. ఆమె వెంట దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ కూడా ఉన్నారు. చిన్నారులపై లైంగిక అంశాన్ని కథాంశంగా ఎంపిక చేసుకుని సామాజిక చిత్రాన్ని తీసిన దర్శకుడితోపాటు నటి సాయి పల్లవిని అభిమానులు అభినందించారు.
Advertisements
తమిళ నటుడు సూర్య ఇప్పటికే ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత గొప్పగా రచించి, గొప్పగా తీసిన సినిమాగా ఇది గుర్తుండిపోతుందన్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొద్ది రోజుల క్రితం సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.