అందాల భామ సాయి పల్లవి తన నటనతో, అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మలయాళ సినిమా ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తెలుగులో ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది. అచ్చం పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే సాయి పల్లవి తొలి తెలుగు సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది.
నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ .. గ్లామర్ షో కు దూరంగా ఉంటూ.. కెరీర్ లో దూసుకుపోతుంది ఈ భామ. ఇప్పటికే తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో సత్తా చాటింది సాయి పల్లవి. ఇటీవలే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టింది. త్వరలో రానా హీరోగా రానున్న విరాట పర్వం సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిన్నది కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న తమిళ్ హీరో శివ కార్తికేయన్.. రీసెంట్ గా డాన్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరోకు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాకి ‘మావీరన్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. తమిళంతో పాటు.. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది.