రిపబ్లిక్ విడుదలకు కొద్ది రోజుల ముందు, గత ఏడాది చివర్లో జరిగిన రోడ్డు ప్రమాదం తరువాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు సాయితేజ్. కోలుకున్నప్పటికీ బయట కనిపించడం తగ్గించేశాడు. ఈమధ్య తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కేవలం 25 రోజుల్లో 30 శాతం చిత్రీకరణను పూర్తి చేసింది యూనిట్. ఇదే ఉత్సాహంతో, మిగతా షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సాయితేజ్.
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు రుద్రవనం అనే టైటిల్ అనుకుంటున్నారు. దీనిని ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. షామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సాయి తేజ్ కెరీర్‌లో ఓ మిస్టికల్ థ్రిల్లర్ చేయడం ఇదే తొలిసారి. ప్రకటన రోజే విడుదలైన ప్రీ లుక్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.