కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు మెగా హీరో సాయితేజ్. ఒకే జానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు కొత్తగా మరో సినిమా మొదలుపెట్టాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
ఇలా ఏ రెండు సినిమాలు జానర్ విషయంలో మిక్స్ అయ్యేలా ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు సాయితేజ. యాక్సిడెంట్ తర్వాత సినిమాల విషయంలో జోరు తగ్గించాడు ఈ హీరో. అదే టైమ్ లో రిపబ్లిక్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు.
దర్శకులు కొత్త వాళ్లయినా కథలు బాగుంటే ముందుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు ఈ హీరో. ఈ విషయంలో ఇతర హీరోలతో పోటీ పడకుండా తన మార్కెట్ ను కాపాడుకుంటూ, ఫ్యాన్ బేస్ ను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ పైనే 2 సినిమాలు చేస్తున్నాడు సాయితేజ్. ఈ రెండు సినిమాల్ని కొత్త దర్శకులే తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు మూవీస్ పూర్తయిన తర్వాత ఓ పెద్ద దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు ఈ హీరో. సాయితేజ్ లిస్ట్ లో హరీశ్ శంకర్ పేరు చాన్నాళ్లుగా నలుగుతోంది.