హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తెలుగు సైనికుడు సాయితేజకు వీడ్కోలు పలికేందుకు యువత పెద్ద ఎత్తున మదనపల్లికి చేరుకున్నారు. జాతీయ జెండాలు, సాయితేజ్ ఫోటోలు ఉన్న టీ షర్ట్ లు ధరించి వేలాది మంది యువకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. జైజవాన్, సాయితేజ అమర్ రహే అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
బెంగళూరు నుంచి ఈ రోజు ఉదయం సాయితేజ పార్థివదేహం తన స్వగ్రమానికి చేరుకుంది. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించున్నారు. పెద్ద ఎత్తున అంతిమయాత్ర జరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మదనపల్లి ఎగువరేగడికి అంతిమయాత్ర ర్యాలీ జరుగుతుంది. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించిన విషయం తెలిసిందే.