భారీ బందోబస్తు నడుమ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సైదాబాద్ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. రూ.20 లక్షల చెక్కు అందించారు. అయితే బాధిత కుటుంబం మాత్రం ఆ చెక్కును తిరస్కరిస్తోంది. తమకు కావాల్సింది డబ్బు కాదని.. న్యాయమని అంటోంది. చెక్కుకు సంబంధించి చిన్నారి తండ్రి ఓ వీడియోను విడుదల చేశాడు.
కలెక్టర్ వెంటనే చెక్కు తీసుకొని వెళ్లాలని తెలిపాడు బాలిక తండ్రి. తాము వద్దని చెప్పినా వినకుండా అక్కడ పెట్టేసి వెళ్లిపోయారని వివరించాడు. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాతే ప్రభుత్వం ఏం చెప్పినా వింటామని స్పష్టం చేశాడు. మంత్రులు ఇచ్చిన చెక్ ను మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిపాడు చిన్నారి తండ్రి.