తొలివెలుగు చెప్పిందే జరిగింది.. ‘ఎన్ కౌంటరా.. ఆత్మహత్యనా’.. అంటూ ఇచ్చిన తొలివెలుగు కథనమే నిజమైంది. ‘‘పల్లకొండ రాజు పోలీసులపై దాడి చేసి ఎదురు కాల్పుల్లో మృతి చెందడం.. లేదా న్యూస్ లో వచ్చిన కథనాలకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించడం.. ఇలా ఏదో ఒక వార్త వస్తుందని తొలివెలుగు ముందే ఊహించింది..’’ అనుకున్నట్లే కొన్ని క్షణాల్లోనే రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ చెప్పినట్లుగా మంత్రి కేటీఆర్ కూడా కన్ఫామ్ చేశారు. ఆరేళ్ల బాలికను చిదిమేసిన మృగాడిని ఎన్ కౌంటర్ అయినా చేస్తారు.. ఆత్మహత్యగా అయినా చూపిస్తారని ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ముందే ఊహించింది తొలివెలుగు. దీనిపై ప్రజా సంఘాల నేతలను అడగ్గా… తామూ అదే భావించామని అన్నారు.
Advertisements
ఈ అంశంపై పీఓడబ్ల్యూ నేత సంధ్య స్పందిస్తూ… ఎన్ కౌంటర్ లేదా ఆత్మహత్యగా చూపిస్తారని తమకు తెలుసని కామెంట్ చేశారు. దీన్ని పోలీసుల హత్యగా చెబుతూ… ఇన్నాళ్లూ నిందితుడు దొరకలేదని చెప్పటం పోలీసుల నాటకమేనని అన్నారామె. వ్యవస్థలతో శిక్ష వేయాలని, హత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే కానీ ఇది సరైనది కాదని చెప్పారు.