పోలీసుల తుపాకులు లోడ్ అయి ఉన్నాయ్… రెండ్రోజుల్లో అసలైన వార్త వినొచ్చు అని ఒకరు, గ్రేట్ పోలీస్… గ్రేట్ పుల్ స్టాప్ పెట్టబోతున్నారని మరొకరు… ఇలా సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్. ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, మంత్రుల అలసత్వంపై జనం మండిపడుతున్న సమయంలో ఎన్ కౌంటర్ పై అనేక వార్తలొస్తున్నాయి.
చిన్నారి ఘటనపై చివరకు మంత్రి కేటీఆర్ కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. నిందితున్ని పట్టుకున్నామని చెప్పి, తీవ్ర విమర్శలు రావటంతో తప్పైంది అని ఒప్పుకున్నారు. కానీ ఓ మీటింగ్ పెట్టి ఎందుకు పట్టుకోవటం లేదని అధికారులను నిలదీయలేకపోయారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించలేకపోయారు.
దేశంలోనే నెం. పోలీస్ అని చెప్పుకునే వీరు… ఓ అనామక నిందితున్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. అయితే, ఇంటా బయటా విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కేటీఆర్ స్వయంగా నవ్వులపాలయ్యారు. ప్రతి ఆడబిడ్డ తండ్రి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతుండటంతో ఎన్ కౌంటర్ చేస్తారన్న అభిప్రాయం పెరుగుతుంది. గతంలో దిశ ఎన్ కౌంటర్ ను గుర్తు చేసుకుంటున్నారు.