దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 01 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ తేజ్ ప్రమాదానికి గురి కావడం వల్ల రిపబ్లిక్ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోకు యాక్సిడెంట్ అయినప్పుడు సినిమాను రిలీజ్ చేయడం నైతికంగా కరెక్ట్ కాదని మేకర్స్ అభిప్రాయ పడుతున్నారట. అందుకే తమ సినిమా అక్టోబర్ 1కి రావడం లేదంటూ మేకర్స్ ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు. కాకపోతే అధికారిక ప్రకటన మాత్రమే చేయలేదు.