బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాహో సినిమాను చెందాడు. ఇకపోతే ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభించక ముందే మరో సినిమాను ఎనౌన్స్ చేసి ప్రభాస్ షాక్ ఇచ్చాడు.
ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం 2021 లో పట్టాలు ఎక్కనుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో లంకేశ్ గా కనిపించనున్నాడు. ఈ మేర ఓ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.