ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆదిపురుష్ లో రావణుడిలో మానవత్వాన్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లు కామెంట్ చేశాడు.
ఓం రౌత్ డైరెక్టర్ గా, ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రావణున్ని మంచిగా చూపే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేత రామ్ కదాం హెచ్చరించిన నేపథ్యంలో సైఫ్ క్షమాపణ కోరాడు.
తను ఆదిపురుష్ లో రావణుడిగా నటిస్తున్నానని… ఈమూవీలో రావణుడిలో మంచితనాన్ని చూపిస్తారని, సీతను ఎందుకు ఎత్తుకెళ్లాల్సి వచ్చిందో చెప్పటంతో పాటు రాముడితో జరిగిన యుద్ధానికి సంబంధించిన అంశాలుంటాయని సైఫ్ అలీఖాన్ కామెంట్ చేశాడు. దీంతో వివాదం తలెత్తింది.