ఫొటోగ్రాఫర్లపై బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఫైర్ అయ్యారు. ఒక్క ఫొటో.. ఒక్క ఫొటో.. అంటూ ఫొటోగ్రాఫర్లు వెంటపడుతుండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ నటి మలైకా అరోరా తల్లి 70వ పుట్టినరోజు వేడుకలకు గురువారం రాత్రి బాలీవుడ్ నటి కరీనా కపూర్ తో కలిసి సైఫ్ వెళ్లారు. పార్టీ తర్వాత ముంబైలోని తమ ఇంటికి వచ్చారు. కారు దిగి ఇంట్లోకి వస్తుండగా.. ఆ సమయంలో ఫోటో గ్రాఫర్ లు వీళ్లిద్దర్నీ ఫాలో అవుతూ సర్ ఒక ఫొటో ప్లీజ్ అంటూ కోరారు. కానీ అటు కరీనా, ఇటు సైఫ్ ఇద్దరూ దీనిపై స్పందించలేదు.
దీంతో మళ్లీ మళ్లీ అడిగేసరికి సైఫ్ అలీ ఖాన్ కాస్త వెటకారంగా సమాధానమిచ్చాడు. ‘ఒక పని చేయండి, మా బెడ్ రూమ్ కు వచ్చి తీసుకోండి’ అని అన్నాడు. ఆ తర్వాత సీరియస్ గా ఇంట్లోకి వెళ్తూ డోర్ క్లోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల ‘విక్రమ్ వేద’ సినిమాతో సైఫ్ అలీఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో హృతిక్ రోషన్ కూడా ఇంకో హీరోగా కనిపించారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ రూపొందించిన ‘ఆదిపురుష్’ సినిమాలో రావణుడిగా సైఫ్ నటించారు. ఈ ఏడాదే సినిమా రిలీజ్ కానుంది.