ప్రేమికుల దినోత్సవం సందర్బంగా కరీనా కపూర్ తో తన ప్రేమాయణం గురుంచి చెప్పాడు సైఫ్ అలీఖాన్. డేటింగ్ చేస్తోన్న సమయాల్లో తన ప్రేమ బంధం మరింత ధృడంగా మారేందుకు నటి రాణి ముఖర్జీ పలు సూచనలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. కరీనాతో డేటింగ్ ను మగాడితో డేటింగ్ లా భావించాలని.. ఇద్దరు సమానమేననే భావనతో ఉండాలని ఆమె సూచనలు చేసిందని సైఫ్ తెలిపాడు. కరీనా కపూర్ పై మగపెత్తనం చేస్తే తన ప్రేమకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు వివరించాడు. రాణి ముఖర్జీ ఇచ్చిన డేటింగ్ టిప్ ను ఎప్పటికీ మర్చిపోలేనని నవ్వుతు వ్యాఖ్యానించాడు సైఫ్ అలీఖాన్.
ప్రతి విషయంలో కరీనా కపూర్ నిర్ణయాలకు తాను మద్దతుగా నిలుస్తానని చెప్పాడు. ఆమె తీసుకునే నిర్ణయాలు సమయోచితంగా ఉంటాయి కనుక తాను ఏ నిర్ణయం తీసుకున్న ఆమెను ఫాలో అవుతానని అన్నాడు. హాలిడేస్ వెకేషన్ ప్లాన్ లో ఆమె పర్ఫెక్ట్ గా నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరీనాతో డేటింగ్ కు ముందు సినిమాలు చేసిన… తాము ఎప్పుడు బయటకు వెళ్లలేదని తెలిపారు సైఫ్ అలీఖాన్.