బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సోదరి సాబా అలీ ఖాన్ తమ కుటుంబానికి చెందిన ఓ పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అది సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫొటో. అందులో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెగా సైఫ్, కరీనాలను చూడవచ్చు. తన అత్త షర్మిళా ఠాగూర్‌కు చెందిన వెడ్డింగ్ డ్రెస్‌ను కరీనా ధరించగా.. సైఫ్ గోల్డెన్ షెర్వానీ, గోల్డెన్ సాఫా ధరించాడు. ఫొటోలో వారిని ఆ దుస్తుల్లో గమనించవచ్చు.
ఆ ఫొటోలో సైఫ్, కరీనా, సైఫ్ సోదరిలు సాబా, సోహా అలీ ఖాన్‌లతోపాటు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, షర్మిళా ఠాగూర్‌లను గమనించవచ్చు. ఇక ఆ ఫొటోతోపాటు సాబా ఇంకో ఫొటోను కూడా షేర్ చేసింది. అది సోహా అలీ ఖాన్, కునాల్ కెమ్ములకు చెందిన పెళ్లి ఫొటో. అందులో ఆ ఇద్దరితోపాలు షర్మిళ, సైఫ్, కరీనా, కునాల్ తరఫు కుటుంబ సభ్యలను చూడవచ్చు. దానికి సాబా REMEMBRANCE..II Deja vu … Soha wedding . Fun Madness. And precious moments అనే కామెంట్‌ను పెట్టింది.
సైఫ్, కరీనాలు 2012లో వివాహం చేసుకున్నారు. వారికి తైమూర్ మొదటి సంతానం. కాగా అతనికి ఇప్పుడు నాలుగేళ్లు. ఫిబ్రవరిలో వారికి ఇంకో కుమారుడు జన్మించాడు. ఇక సారా, ఇబ్రహీంలు సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ సంతానం. ఈ క్రమంలోనే సారా అప్పట్లో తన తండ్రి సైఫ్, సవతి తల్లి కరీనాల వివాహానికి హాజరైంది. ఆ విశేషాలను సారా కాఫీ విత్ కరణ్‌లో పంచుకుంది. ఆ వేడుకకు తన తల్లి అమృత తనను అలంకరించి పంపించిందని కూడా చెప్పింది.