ఇటీవల కాలంలో లో సినీ ఇండస్ట్రీ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.
తాజాగా భారతీయ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. దర్శకుడు అమోల్ గుప్తా ఈ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. సైనా నెహ్వాల్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితీ చోప్రా నటిస్తోంది. నిజానికి ఈ సినిమాని గత ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా కుదరలేదు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా చిత్ర నిర్మాతలు మాత్రం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.