బ్యాడింటన్ లో సత్తా చాటి ఇండియాకు పలు పతాకాలను అందించింది సైనా నెహ్వాల్. కొంతకాలంగా సైనా ఆటకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇటీవల సైనా తన ఫొటోలతో గ్లామర్ డోస్ పెంచేంసింది. దాంతో ఆ ఫోటోలను చుసిన వారంతా సైనా గ్లామర్ డోస్ ఇలా పెంచేయడానికి కారణం ఏంటబ్బా అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైనా ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ అమ్మడు అందానికి ఫిదా అయిన ఓ బాలీవుడ్ దర్శకుడు సైనాను సంప్రదించాడట. తాను చేయబోయే సినిమాలో ఓ కీలక పాత్రను చేయాలనీ ఆమెను కోరాడట. అయితే అందుకు ఆమె అంగీకరించిందా లేదా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవలే సైనా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన సేవలు పార్టీకి అవసరమైన సమయంలో పార్టీకి సేవలు అందిస్తానని చెప్పుకొచ్చింది. ఆమె పార్టీలో చేరడంతోనే బాలీవుడ్ ఎంట్రీ రద్దైయినట్లు తెలుస్తోంది.