విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ్’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కోర్ టీమ్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకుడు.
హీరోలు నాని, రానా, నాగ చైతన్య ఈ ఓపెనింగ్ కు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సురేష్ బాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్ ఇవ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియో భారీ అంచనాలను నెలకొల్పింది. సైంధవ్ భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇది వెంకటేష్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.
ప్రస్తుతానికి నవజుద్దీన్ సిద్ధిఖిని ఫైనల్ చేశారు. మరింతమంది నటీనటుల్ని త్వరలోనే వెల్లడిస్తారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.