తనదైన యాక్షన్, కామెడీ టైమింగ్ తో అలరించే టాలీవుడ్ ‘వెంకీ’మామ కొద్దిరోజుల్లో ‘సైంధవ్’గా మనముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ టేకింగ్ తో ఈయాక్షన్ మూవీని శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు వీడియో చూడగానే, యాక్షన్ ఒక రేంజ్ లోనే ఉంటుందనే విషయం అర్థమైపోయింది.
ఆ తరువాత నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఒక్కసారిగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు.భారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటైనర్ పై, తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అప్పటికే ఆయన గాయపడి ఉండటం చూస్తుంటే, ఇంకా ఎవరైనా వస్తే రానీ చూసుకుందాం అన్నట్టుగా ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడనే విషయం తెలుస్తోంది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికీ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు