నాగ శౌర్య… హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మరోవైపు సాయి పల్లవి కూడా సౌత్ లో వరుస అవకాశాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి గతంలో కణం సినిమా చేశారు. కాగా ఆ సమయంలో నాగ శౌర్య చాలా ఇంటర్వ్యూలలో సాయి పల్లవి గురించి మాట్లాడుతూ అన్ ప్రొషెషనల్ హీరోయిన్ అని, ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుని సహనం కోల్పోవడం సాయి పల్లవిలో తనకు నచ్చని గుణమని చెప్పుకొచ్చాడు.
తన ప్రవర్తన వల్ల సెట్‌లో చాలామంది ఇబ్బంది పడ్డారని తెలిపాడు. అయితే ఇప్పుడు మూడేళ్ళ తరువాత ఈ విషయంపై స్పందించింది సాయిపల్లవి. కణం సినిమా దర్శకుడు ఎ.ఎల్.విజయ్, కెమెరామెన్ నిరవ్‌షాకు ఫోన్ చేసి సెట్‌లో నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని అడిగానని తెలిపింది.
వారు అలాంటిది ఏమీ లేదని చెప్పారని…. ఇక నటుడిగా శౌర్య అంటే నాకు గౌరవమని, కానీ ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారని చెప్పుకొచ్చింది.
దానిని నేను పాజిటివ్‌గానే తీసుకున్నా. నిజంగా సెట్‌లో నా వల్ల అతనికి ఇబ్బంది కలిగింది అంటే బాధగా ఉంది. నా సమాధానంతో ఇప్పుడైనా ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు.