గోపీచంద్ ధైర్యం ఏమిటి? చాణక్య మూవీ స్క్రిప్ట్ లో అంత దమ్ముందా? సైరా మూవీకి పోటీగా మూడు రోజుల తేడాతో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? సహజంగా పెద్ద మూవీకి పోటీగా మరో చిత్రం విడుదల ఉండదు. ఈ మధ్య కాలంలో మూవీ రిలీజ్ లో పోటీ లేకుండా వాయిదాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో నమ్మకం ఉంటే కానీ పెద్ద సినిమాకి పోటీ మూవీ ఉండదు. ఇంతకూ గోపీచంద్ చాణక్య రేసులో నిలుస్తుందా? ఇది టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రశ్న.
మొత్తం మీద గోపీచంద్ బాక్సాఫీస్ దగ్గర సాహసానికి రెడీ అయ్యారు. దసరా పండక్కి చిరంజీవి ‘సైరా’ అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది. దానికి పోటీగా గోపీచంద్ ‘చాణక్య’ను అక్టోబరు 5న విడుదల చేస్తునారు. చిరు డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ విజువల్ వండర్‌లా రూపొందగా ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోందని ప్రకటన రాగానే టాలీవుడ్‌లోని మిగతా చిత్రాలన్నీ ఆగిపోయాయి. చాలా మూవీలు దసరా రేసు నుంచి తప్పుకున్నాయి.
విశేషమేమిటంటే సైరాకు పోటీగా బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు గోపీచంద్ సిద్ధమయ్యాడు. ‘సైరా’ విడుదలకు మూడు రోజుల వ్యవధిలో తన ‘చాణక్య’ను బిగ్ స్క్రీన్స్ పైకి తెస్తున్నారు. అక్టోబరు 5న చాణక్య చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చేశారు. దసరా సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద చిరంజీవి సినిమా ఉన్నా ప్రేక్షకులకు ప్రత్యామ్నాయంగా మరో సినిమా చూసే అవకాశం కల్పించేందుకే చిత్ర బృందం 5న ‘చాణక్య’ను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే మాంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ‘చాణక్య’పై పెట్టుకున్న నమ్మకం నిజమవుతుందా? రా ఏజెంట్ గా గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ కథాంశం హిట్ ఇస్తుందా? లేదా? అనేది ఫాన్స్ సందేహం.