బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలు గుర్తించడం ఆర్మీ అధికారులకు సవాల్ గా మారింది. వారిని గుర్తించేందుకు కుటుంబసభ్యుల బ్లెడ్ సాంపిల్స్ సేకరించిన అధికారులు డీఎన్ఏ పరీక్షలు జరిపారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలు గుర్తించిన అధికారులు.. చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజకు కూడా గుర్తించినట్టు తెలిపారు.
అతడి మృతదేహాన్ని తన స్వగ్రామానికి చేర్చుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అంత్యక్రియల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.