సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎగువరేగడ ప్రాంతానికి వచ్చి.. వీర సైనికుడికి నివాళులు అర్పించారు. మదనపల్లి నుంచి ఎగువరేగడి వరకు సుమారు 30 కిలోమీటర్లు అంతిమయాత్ర నిర్వహించారు. సైనిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
భర్త భౌతికకాయం దగ్గర సాయితేజ్ భార్య శ్యామల సొమ్మసిల్లి పడిపోయింది. సాయితేజకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని వయసులో తండ్రి ఫోటో పట్టుకొని పిల్లలిద్దరూ బోరున విలపించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
జిల్లా నలుమూలల నుంచి అక్కడికి చేరకున్న యువత జాతీయ జెండాలు, సాయితేజ్ ఫోటోలు ఉన్న టీ షర్ట్ లు ధరించి ర్యాలీ నిర్వహించారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించిన విషయం తెలిసిందే.