అట్టడుగు వర్గాల వారు అభివృద్ది సాధించాలన్నదే సీఎం లక్ష్యం అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందరూ కలసి వచ్చి సహకరిస్తే జగన్ కల సాకారం అవుతుందన్నారు. నామినేటెడ్ లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ,బీసీలకు సీఎం జగన్ …50శాతం ఇవ్వడం సాహసోపేతమైందని కొనియాడారు.
దళితులు సమానంగా అభివృద్ది చెందితేనే రాజ్యాధికారం వస్తుందన్నారు. దీనికి ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవని అన్నారు. గెజిటెడ్ ఉద్యోగులంతా మన వారికి అవకాశాలు కల్పించాలని భావించి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పథకాలు వాడుకుని బాగుపడేలా చేసే బాధ్యత గెజిటెడ్ ఉద్యోగులదేనని చెప్పుకొచ్చారు. ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు,సర్వీస్ కండుషన్ల సమస్యలపై అందరూ కలసి రావాలని కోరారు.
ఒపెన్ మైండ్ తో ఉద్యోగుల సమస్యలను సీఎం పరుష్కరిస్తున్నారని అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేసి అయినా సరే సమస్యలను సీఎం పరిష్కరిస్తారని అన్నారు సజ్జల.