ఏపీలో పీఆర్సీ యుద్ధం ముగిసింది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిట్మెంట్ పెంచడానికి ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేదన్నారు సజ్జల.
ఫిట్మెంట్ కాకుండా మిగిలిన అన్ని అంశాల్లో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆర్ధిక భారం పడినా హెచ్ఆర్ఏ, సీసీఏ అదనపు ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. ఉన్న దాంట్లో మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చేయాలని సీఎం చెప్పారని వివరించారు.
కొన్ని పట్టు విడుపులు ఉంటాయని.. కొన్ని సందర్భాల్లో సర్దుకుని వెళ్లాలని సూచించారు సజ్జల. ఇక ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత చూపించడం.. చిన్న అపశృతిగా చెప్పారు.
ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని.. ఉపాధ్యాయ సంఘాలు కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయి. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదిస్తున్నాయి. ప్రభుత్వం టీచర్లకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందని యూటీఎఫ్ రాష్ట్ర అధక్షుడు వెంకటేశ్వర్లు మండిపడుతున్నారు. సీపీఎస్‌కు సంబంధించి ప్రభుత్వ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.