వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ విడుదల అయింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
స్థానిక సంస్థల కోటా నుంచి 9, ఎమ్మెల్యే కోటా నుంచి 7, గవర్నర్ కోటాలో రెండు సీట్లు కలిపి మొత్తం 18 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేసారు. ఇందులో బీసీలకు 11 సీట్లు, అలాగే ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు ఒక సీట్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు.
స్థానిక సంస్థల అభ్యర్థులు:
1) నర్తు రామారావు
2) కుడిపూడి సూర్యనారాయణ
3) వంకా రవీంద్రనాథ్
4)కవురు శ్రీనివాస్
5) మెరుగ మురళి
6) డా. సిపాయి సుబ్రమణ్యం
7) రామసుబ్బారెడ్డి
8) డాక్టర్ మధుసూధన్
9) ఎస్ మంగమ్మ
ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు:
10) పీవీవీ సూర్యనారాయణరాజు
11) పోతుల సునీత
12) కోలా గురువులు
13) బొమ్మి ఇజ్రాయెల్
14) ఏసు రత్నం
15) మర్రి రాజశేఖర్
16) జయమంగళ వెంకటరమణ
గవర్నర్ కోటా అభ్యర్థులు:
17) కుంబా రవిబాబు
18) కర్రి పద్మశ్రీ
కాగా సుదీర్ఘ కసరత్తు తరువాత ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఖరారు చేసిన వారి పేర్లను, ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్దుల ఖరారును పరిగణలోకి తీసుకొని ఈ పేర్లకు ఆమోద ముద్ర వేసినట్లు కనిపిస్తోంది.