సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ విజయం ఖాయం. ప్రతీ ఎన్నికను మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ప్రజల అభిమానం, ఆదరణ వైసీపీకి ఎప్పుడూ ఉంటుంది. మేము ఏం చేశామో ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం మటన్ షాపులు పెడుతోందన్న ప్రచారంలో నిజం లేదు. షాపుల్లో శుభ్రత పెంచేందుకు ఆలోచిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.
ఆన్ లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి మంచి చేయాలనే చూస్తోంది. అన్నివిధాలా సహకరిస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్ కి ఇబ్బంది తప్పదు. ఆయన్ను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు.