• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » సానియాకి సజ్జనార్‌ సలహా!

సానియాకి సజ్జనార్‌ సలహా!

Last Updated: January 30, 2023 at 1:39 pm

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఆర్టీసీ సేవలకు సంబంధించిన సమాచారంతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో రోజూ ఏదోక అంశంపై పోస్టులు పెడుతూ ప్రజలకు సజ్జనార్ చేరువగా ఉంటారు. ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ అధికారుల్లో ఆయన మందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.

తాజాగా హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్యాంపెయిన్‌ను సజ్జనార్ ట్విట్టర్‌లో తప్పుబట్టారు మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థలకు ప్రచారం చేయవద్దని, ఇలాంటి సంస్థల వల్ల భారత ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని సానియా మీర్జాకు సూచించారు. అసలు సెలబ్రెటీలు ఎవరూ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలను ప్రమోట్ చేయడం, ప్రచారం చేయడం లాంటివి చేయవద్దని సజ్జనార్ కోరారు.

ప్రముఖ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్‌కు సానియా మీర్జా ప్రచారం చేస్తున్నారు. దీంతో క్యూనెట్‌ సంస్థకు సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని తప్పుబట్టిన సజ్జనార్.. అసలు సెలబ్రెటీలు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని సూచించారు. గతంలో సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో క్యూనెట్ సంస్ధపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థలో సోదాలు జరిపి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమందిని అరెస్ట్ చేశారు.

ఆ సంస్ధకు చెందిన బ్యాంకుల్లోని రూ.కోట్ల నగదును సీజ్‌ చేశారు. అయితే ఆ తర్వాత క్యూనెట్ సంస్ధ మళ్లీ హైదరాబాద్‌లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. ఇటీవల ఆ సంస్థపై ఈడీ దాడులు కూడా జరిగాయి. మనీ లాండరింగ్, హవాలా ఆరోపణలు రావడంతో.. ఆ కంపెనీ కార్యాలయాలతో పాటు క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.

ముంబై, బెంగళూరు, చెన్నైలలోనూ ఈడీ సోదాలు జరిగాయి. అలాగే 36 బ్యాంకుల్లో క్యూనెట్‌కు సంబంధించిన రూ.90 కోట్లు ఇటీవల సీజ్‌ చేశారు. ఈ క్రమంలో సజ్జనార్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. క్యూనెట్‌కు సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలుచోట్ల వినియోగదారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు.

చట్ట వ్యతిరేకంగా క్యూనెట్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పేరుతో వ్యాపారం కొనసాగిస్తుందని చెబుతున్నారు. ఈ కంపెనీలో చేరి తమ ఉత్పత్తులు అమ్మితే భారీ లాభం వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారని, ఇలాంటి కంపెనీల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉత్పత్తుల అమ్మకం పేరుతో మహిళలతో అసభ్యకరమైన పనులు కూడా చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

I humbly request all celebrities to refrain from supporting/promoting QNET & all such Multi-Level Marketing companies which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. Very unfortunate that this happened in #Hyderabad today. @MirzaSania pic.twitter.com/o8T2Odb8DG

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 29, 2023

Primary Sidebar

తాజా వార్తలు

గాల్లో ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..!

ఆస్పత్రికి తాళం వేసి… పానీ పూరీ దుకాణం పెట్టిన డాక్టర్..!

మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్…!

ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి నానా హంగామా చేస్తున్నారు… చంద్రబాబుపై రోజా ఫైర్..!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

పెదరాయుడు విలన్ రియల్ లైఫ్ లో కూడా విలనేనా…?

కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా… సింగిల్ బెడ్ రూమ్ లోనే ఉండే నటుడు…!

తరుణ్ కి ఆ హీరోయిన్ తో పెళ్లి కావాల్సిందా…?

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

కేంద్రం కనీసం ఒక్క ఫ్లై ఓవర్ ను కూడా పూర్తి చేయలేకపోయింది: కేటీఆర్

ఫిల్మ్ నగర్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Bhojpuri actress Akanksha Dubey 'dies by suicide' in Varanasi hotel - The  Economic Times

వారణాసిలో భోజ్ పురి నటి ఆత్మహత్య

balakrishna ipl 2023 commentator telugu hero nandamuri balakrishna turns as ipl commentator

ఐపీఎల్ 2023 కామెంటేటర్‎గా బాలయ్య!

hero sai dharam tej pawan kalyan movie copmletes talkie part of vinodayaseetham remake

థ్యాంక్యూ గాడ్‌..సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేశాం!

ccl 2023 telugu warriors akhil team won the title

తెలుగు వారియర్స్‌ కి నాలుగోసారి కప్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap