పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నట్లు తెలుస్తోంది. మధు గురుస్వామి మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు.
గత నెలలోనే దర్శకుడు ప్రశాంత్ నీల్ గురుస్వామిని కలవగా… ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఈ సినిమాలో ప్రభాస్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో రొమాన్స్ చేయనున్నాడు. లాస్ట్ వీక్ శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు.