యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా కూడా చేస్తున్నాడు. దీనితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.
అయితే ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సలార్ సినిమా కోసం ప్రభాస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. రేంజ్ రోవర్ కార్ లో నుంచి ప్రభాస్ దిగుతూ సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ఇదే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సలార్ సినిమా లుక్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ న్యూ లుక్ లో ప్రభాస్ మాత్రం అదిరిపోయాడు అనే చెప్పాలి.