రాధేశ్యామ్ షూటింగ్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్… తన ఫోకస్ ను ఇక సలార్ మూవీపైకి మార్చబోతున్నారు. వరుసగా సినిమాలను ఒకే చేస్తూ వచ్చిన ప్రభాస్… సలార్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఒకే అనటంతో జనవరి 18 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలవ్వనుంది.
షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరులోనే పూర్తి చేయనుండగా.. కేజీఎఫ్ కు పనిచేసిన టెక్నికల్ టీంనే ప్రశాంత్ నీల్ కొనసాగించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హంబులే ఫిల్మ్స్ సంస్థే ఈ మూవీని కూడా తెరకెక్కించనుంది.
2021, దసరాకు సలార్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.