బాహుబలి తర్వాత ప్రభాస్ కు సరైన హిట్ లేదు అనే మాట వాస్తవం. అందరు హీరోలు వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో ప్రభాస్ మాత్రం హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే వరుస సినిమాలకు సైన్ చేస్తున్నా సరే ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మూడు సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. వచ్చే ఏడాది రెండు సినిమాలను విడుదల చేయనున్నాడు.
ఇదిలా ఉంచితే ఇప్పుడు ప్రభాస్ ఆశలు అన్నీ కూడా సలార్ సినిమా మీదనే ఉన్నాయని తెలుస్తుంది. కేజిఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా హక్కులను భారీగా అమ్మడానికి కూడా నిర్మాణ సంస్థ వెనకడుగు వేయడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోనే వంద కోట్లకు అమ్మే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే హోంబలే సంస్థ దీనికి సంబంధించి కసరత్తులు కూడా మొదలుపెట్టింది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ కు క్రేజ్ ఉండటంతో ఇప్పుడు ఆ క్రేజ్ ని వాడుకుంటున్నారు. డేట్ చెప్పినా ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది క్లారిటీ లేదు అంటున్నాయి సినీ వర్గాలు.