మనందరికి కుక్కలంటే ఇష్టం ఉంటుంది.. ముద్దుగా కుక్కపిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు..కానీ హ్యుండాయ్ కంపెని ఒక అడుగు ముందుకు వేసి కుక్కకి ఏకంగా సేల్స్ మాన్ గా ఉద్యోగం ఇచ్చింది..ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయాన్ని స్వయంగా కంపెనివాళ్లే తమ ఇన్స్టా అకౌంటలో పోస్ట్ చేసారు.. చెప్తే నమ్మరని కుక్క ఫోటోలు కూడా షేర్ చేసారు..
ఏడాది వయసున్న ఒక వీధికుక్క ప్రతి రోజు హ్యూండాయ్ షోరూమ్ డోర్ వెలుపల తచ్చాడుతూ ఉండేది.. వచ్చే పోయి కస్టమర్స్ ని పరిశీలిస్తూ ఉండేది.. అది అక్కడక్కడే తిరుగుతున్న ఎవరికి ఏ హాని చేసేది కాదు, షోరూం ఎంప్లాయిస్ కి మచ్చిక అయింది..దాంతో ఎవరూ కూడా దాన్ని ఒక వీధి కుక్కగా చూసేవారు కాదు..నిన్నా మొన్నటి వరకు ఏదో సంబంధంలేని వ్యక్తిగా అక్కడే పడి ఉన్న ఆ కుక్కను ఏకంగా తమ కంపెనిలో భాగస్వామిగా చేసుకున్నారు..
టస్కన్ ప్రైమ్ అని ఆ కుక్కకి పేరు పెట్టారు.. సేల్స్ మాన్ గా ఉద్యోగం కల్పిస్తూ దానికి ఒక ఐడికార్డుని కూడా అందచేశారు.. కార్స్ మెంబర్స్ షిప్స్ కి సంబంధించిన ఏ విషయాన్నైనా మా టస్కన్ ని సంప్రదించొచ్చు అని మెన్షన్ చేశారు..సేల్స్ మాన్, వాచ్ మన్ తనకు ఏ ఉద్యోగం చేయాలనిపిస్తే అది చేస్తుంది టస్కన్.. కంపెని ఉద్యోగిగా ఎగ్జిక్యూటివ్స్ తో మీటింగ్స్ లోనూ పాల్గొంటుంది..ప్రస్తుతం టస్కన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతన్నాయి..హ్యూండాయ్ వాళ్లు తమ షోరూ బయట బోర్డు పెట్టించారు..ఏమని అంటే “Hundai love pets”..