భారీగా పెరుగిన ఎండలకు మద్యం ప్రియులు చల్లదనాన్ని కోరుకుంటున్నారు. చల్లని బీర్ల కోసం ఆరాటపడుతున్నారు. అంతే వేగంగా బీర్ల అమ్మకాలు పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్ తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు.
విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయంటున్నారు. అన్ని రకాల మద్యం అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 19 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
2021-22 లో లిక్కర్ 26,87,808 కేన్లు అమ్ముడయితే, బీర్లు 26,12,694 కేన్లు అమ్మేశారు. 2022-23లో లిక్కర్ 27,69,998 కేన్లు తాగితే.. బీరు ఏకంగా 43,84,285 కేన్లు తాగేశారు. తెలంగాణల బీర్ల అమ్మకాల్లో 10 జిల్లాల్లో కరీంనగర్ టాప్ లో నిలిచింది. 150 శాతం వరకూ అక్కడ బీర్ల అమ్మకాలు పెరిగినట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఆ తర్వాత మెదక్ లో 146 శాతం, కామారెడ్డిలో 124 శాతం అమ్మకాలు ఎక్కువగా నమోదైనట్టు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో 123 శాతం, ఆదిలాబాద్ లో 122 శాతం, సంగారెడ్డి జిల్లాలో 120 శాతం బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎక్సైజ్ ఆదాయం మరింతగా పెరగనుందని అభిప్రయపడుతున్నారు.